రహదారులకు మరమ్మత్తులు చేపట్టండి -పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
రహదారులకు మరమ్మత్తులు చేపట్టండి
-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులకు, అంతర్గత రహదారులకు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆర్అండ్ బి, పంచాయితీరాజ్ శాఖలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటె శ్వర్లు ఆదేశించారు. ఆదివారం ఆయా శాఖలకు అధికారులకు చరవాణిలో మాట్లాడారు. త్వరలో మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో రహదారులకు మరమ్మత్తు పనులను చేపట్టి
త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భద్రాచలం- మణుగూరు -ఏటూరునాగారం రహదారి మొత్తం గుంతలమయమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. చిన్నచిన్న వాహనాలు సైతం ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని, పెద్ద పెద్ద గోతుల్లో అవసరమైన మేర మరమ్మత్తులు చేపట్టి పూడ్చి వేయాలని అన్నారు. మణుగూరు నుండి బీటిపిఎస్ వరకు గల రహదారి గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతోందని, నిత్యం ఈ రహదారిపై ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దెబ్బతిన్న రహదారులను మెరుగుపర్చి ప్రజల ప్రయాణాలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చె యాలన్నారు. జాతర సందర్భంగా వాహనాల రద్దీ కూడా పెరుగుతున్నందున ముందుస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారి కోతకు గురైందని. అటువంటి ప్రాంతాల్లో శాశ్వత చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.