మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం
మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం
మణుగూరు, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితిసింగారం గ్రామపంచాయితీ గుండివారి గుంపుకి చెందిన రెడ్డిమళ్ల లక్ష్మయ్య(70) పక్షవాతం తో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. దహన సంస్కారాలకు ఆ నిరుపేద కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మణుగూరు మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి గృహానికి వెళ్ళి మృతదేహాన్ని సందర్శించి నివాళ్ళు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం దహన సంస్కారాల నిమిత్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3వేలను ట్రస్ట్ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేము సైతం వి ఎత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు మంగి మల్లికార్జున్, ట్రస్ట్ పి జగన్ మోహన్, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.