తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సురక్షిత ప్రయాణానికి రోడ్డు భద్రత నియమాలు పాటించాలి -భద్రాచలం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిరుపతి

సురక్షిత ప్రయాణానికి రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

-భద్రాచలం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ తిరుపతి

మణుగూరు, శోధన న్యూస్: ప్రతి ఒక్క వాహనదారుడు, చోదకులు రోడ్డు భద్రత నియమ నిబంధనలను తప్పక పాటిస్తూ సురక్షిత ప్రయాణాలు సాగించాలని భద్రాచలం మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ తిరుపతి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు భద్రత నియమాలు, సురక్షిత ప్రయాణాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంవీఐ తిరుపతి మాట్లాడుతూ…ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, కార్లు, లారీలు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకుని ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని సూచించారు. . రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపడం వల్ల సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని, మీపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉంటారని తెలిపారు. తద్వారా సంతోషకర జీవనం సాగించవచ్చన్నారు. అలాగే వాహనాలకు వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని, ఆటోవాలాలు ఆటోలో డ్రైవర్ సీట్ పక్కన ఎవరిని కూర్చోబెట్టుకొ కూడదని, ప్రయాణికులు కూర్చొనే సీటు కుడి వైపు ఉన్న మార్గాన్ని మూసివేయాలని సూచించారు. వాహనాలు నడిపేవారు. సంబంధిత వాహనాల కాగితాలను డ్రైవింగ్ లైసెన్స్లు తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *