ప్రజా పాలన గ్యాస్ సర్వే పరిశీలించిన ఎంపీడీవో
ప్రజా పాలన గ్యాస్ సర్వే పరిశీలించిన ఎంపీడీవో
వైరా, శోధన న్యూస్: ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని తాటిపూడి గొల్లపూడి,వల్లాపురం గ్రామాలలో మండల అభివృద్ధి అధికారి దగ్గుల కరుణాకర్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామాలలో జరుగుతున్న ప్రజాపాలన దరఖాస్తులు గ్యాస్ పంపిణీ సర్వే ని కరుణాకర్ రెడ్డి పరిశీలించి వారి నుంచి సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించడంతోపాటు పంచాయతీల సెక్రటరీలకు పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం లేకుండా చూడాలని ఏ గ్రామంలో పారిశుద్ధ సమస్యలు రాకూడదని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరిలు వేణు, ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.