విద్యార్థుల్లో సామాజకి సేవల పై చైతన్యపర్చడం అభినందనీయం -భద్రాచలం ఐటిడిఏ పీఓ ప్రతీక్ జైన్
విద్యార్థుల్లో సామాజకి సేవల పై చైతన్యపర్చడం అభినందనీయం
-భద్రాచలం ఐటిడిఏ పీఓ ప్రతీక్ జైన్
భద్రాచలం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఏ పీఓ ప్రతీక్ జైన్ ను డిడీ టైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ శుక్రవారం వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ సేవా పథకంలో భాగంగా నిర్వ హించే సేవా కార్యక్రమాలకు హాజరుకావాలని కోరుతూ పిఓకు ఆయన ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం పిఓ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ… గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు చదువుతో పాటు ఏజెన్సీ గ్రామాలలోని గిరిజన ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడంలో చైతన్య స్ఫూర్తిని నింపి సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం, వారి భవిష్యత్తు బంగారు బాటలో పయనించేలా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం వెల్లివిరయనుందని అన్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాలలో ఎస్ఎస్ఎస్ వాలంటీర్లే కాక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు గ్రామంలోని ప్రజలు భాగస్వాములై విద్యార్థులు చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామంలో ఈనెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు 70 మంది ఎస్ఎస్ఎస్ వాలంటీర్లతో సామాజిక సేవా కార్యక్రమాలు, వివిధ స్థితిగతులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించమన్నట్లు తెలిపారు.