బదిలీపై వెళ్లిన ఎస్ఐ సురేష్ కు ఘన సన్మానం
బదిలీపై వెళ్లిన ఎస్ఐ సురేష్ కు ఘన సన్మానం
తల్లాడ , శోధన న్యూస్ : తల్లాడ పోలీస్ స్టేషన్ లో రెండు సంవత్సరాల పాటు విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఎస్సై పి. సురేష్ ను తల్లాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను వైరా, కొనిజర్ల, తల్లాడ ఎస్సైలు మేడా ప్రసాద్, శంకర్ రావు, కొండలరావు శాలువాలు పూలమాలతో సన్మానించి సత్కరించారు. తల్లాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రెండేళ్లపాటు తల్లాడ మండల ప్రజలకు సేవలందించిన ఆయన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తల్లాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.