ఉప్పల చిలక కేజీబీవీ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం
కేజీబీవీ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం
– విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి: సత్తుపల్లి రూరల్ సిఐ వెంకటేశం
పెనుబల్లి,శోధన న్యూస్ : మండల పరిధిలోని ఉప్పల చిలక కేజీబీవీ పాఠశాల, కళాశాల నందు విజిఎఫ్ ట్రస్ట్ సహకారంతో 50 వేల రూపాయల విలువ చేసే ల్యాబ్ మెటీరియల్ తో సైన్స్ ల్యాబ్ ను ముఖ్య అతిథులు సత్తుపల్లి రూరల్ సిఐ వెంకటేశం, ఆర్టిఓ వెంకట పుల్లయ్య శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సైన్స్ ల్యాబ్ ను చక్కగా ఉపయోగించుకుని మంచి మార్కులు సంపాదించాలని అన్నారు ల్యాబ్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం సహకారం అందించిన విజిఎఫ్ ట్రస్ట్ మరియు చైర్మన్ ఆళ్ళ రంగాచారిని అభినందించారు ఇటువంటి మంచి పనులకు వారు కూడా విద్యార్థులకు అన్నివేళలా సహకరిస్తామని అన్నారు. పాఠశాల నుండి స్పోర్ట్స్ నేషనల్ మీట్ కు ఎంపికైన బొర్రా కృష్ణవేణికి ఆర్టీవో వెంకట పుల్లయ్య 3000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. పాఠశాల స్పెషల్ అధికారి సిహెచ్ వెంకటరమణ మాట్లాడుతూ విజిఎఫ్ ట్రస్ట్ అందిస్తున్న సహకారం మరువలేనిదని ట్రస్ట్ వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని అనారు. ఈ కార్యక్రమంలో ఏ సూర్యనారాయణ, నరసింహ, భద్రకాళి, శశి, రజిని, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.