విజయవంతమైన అప్రెంటిస్ మేళ
విజయవంతమైన అప్రెంటిస్ మేళ
-అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
-మణుగూరు ఐటీఐ ప్రిన్సిపల్ బడుగు ప్రభాకర్
మణుగూరు, శోధన న్యూస్: మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా విజయవంతమైంది. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఐటిఐ ప్రిన్సిపాల్ బడుగు ప్రభాకర్ తెలిపారు. మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో నిర్వహించిన అప్రెంటిస్ మేళాకు వివిధ ప్రాంతాలకు చెందిన 165 మంది వివిధ ట్రేడ్లకు చెందిన ఐటిఐ పూర్తిచేసిన యువత హాజరైనారు. ఈమెలకు హైదరాబాద్ చెన్నైకి చెందిన సుమారు పది హోల్డింగ్ ప్రతినిధులు హాజరయ్యారు. మేళాకు హాజరైన వారిలో 90 మందిని అప్రెంటిస్ కోసం ఆయా కంపెనీలు ఎంపిక చేసుకోవడం జరిగింది. మణుగూరు వంటి మారుమూల ప్రాంతాల్లో ఐ టీ ఐ పూర్తి చేసినవారికి ఇటువంటి మేళాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను నేటి యువత సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అప్రెంటిస్ మేళాను వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి సీతారాములు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ట్రైనింగ్ ఆఫీసర్ కే శోభన్ బాబు, మణుగూరు టిఓ జి రవి, సూపర్డెంట్ టిఎన్ జ్యోతి రాణి, ఏటీవోలు జీవీ కృష్ణారావు, ఎం శ్రీనివాసరావు, ఏ నరసయ్య, సిబ్బంది నరేష్ తదితరులు పాల్గొన్నారు.