స్లీపర్ బస్సులను సద్వినియోగం చేసుకోండి -సత్తుపల్లి తహసిల్దార్ యోగేశ్వరరావు
స్లీపర్ బస్సులను సద్వినియోగం చేసుకోండి
-సత్తుపల్లి తహసిల్దార్ యోగేశ్వరరావు
సత్తుపల్లి, శోధన న్యూస్:
ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకుగాను సత్తుపల్లి డిపో నుండి రెండు లహరి నాన్ ఎసి స్లీపర్ బస్సులు ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని సత్తుపల్లి తహసిల్దార్ కే యోగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక డిపో ఆవరణలో సత్తుపల్లి డిపోకు కేటాయించిన రెండు నాన్ ఎసి లహరి బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారని ప్రయాణికుల అభిప్రానుసారం టిఎస్ఆర్టిసి లహరి నాన్ ఎసి స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలు సత్తుపల్లి నుండి హైదరాబాదు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి కోరారు. సోమవారం రాత్రి 11 గంటల నుండి ప్రయాణికులకు అందుబాటులో స్లీపర్ బస్సు ఉంటుందని డిపో మేనేజర్ తెలిపారు. సత్తుపల్లి నుండి బీహెచ్ఈఎల్ కు స్లీపర్ నాన్ ఎసి లహరి బస్సును ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు ఆమె వివరించారు. ఈ బస్సులు 33 సీట్లు 15 బెర్త్ లు ఉన్నాయని అన్నారు. సత్తుపల్లి నుండి లహరి బస్సులో వైఫై కనెక్షన్ తోపాటు, బెర్త్ సౌకర్యం, చార్జర్ పిన్ సౌకర్యం, వాటర్ బాటిల్, సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ప్రయాణికులు అందరూ ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ యోగేశ్వరరావు, ఆర్ ఐ నరేష్, అసిస్టెంట్ మేనేజర్ పి విజయ శ్రీ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ సిలివేరి సాహితి, డిపో ఎడిసిలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.