తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ముమ్మరంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు 

ముమ్మరంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా కార్యదర్శి డాక్టర్ పి విజయకుమార్ ఆధ్వర్యంలో వేగవంతంగా కొనసాగుతుంది. నాలుగవ రోజులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం లోని ఐ డి ఓ సి లోని వివిధ జిల్లా విభాగ అధికారులను మరియు కొత్తగూడెం పాల్వంచ ఇల్లందు భద్రాచలం ప్రాంతాలలోని అధికారులను కలిసి సభ్యత్వం ఇవ్వడం జరిగినది. జిల్లా పరిషత్ సీఈఓ ప్రసన్న రాణి కి, డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర రావు కి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులకు, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గన్యా కి, జిల్లా వెటర్నరీ అధికారి పురంధర్ కి అడిషనల్ డైరెక్టర్లకు, వెటర్నరీ డాక్టర్లకు, జిల్లా వెనుకబడిన తరగతులు అధికారిని ఈ ఇంద్రాణికి, జిల్లా సివిల్ సప్లై అధికారి రుక్మిణి దేవి కి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి, కోటయ్య డీఏవో కి, మరియు ఇంజనీర్లకు, డి ఆర్ డి ఓ అడిషనల్ డైరెక్టర్ రవి కి, ఎకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు కి, ఇరిగేషన్ పాల్వంచ సబ్ డివిజన్ డిప్యూటీ ఇంజనీర్ ఎం రాణి కి, ఎలక్షన్ సెల్ ఇన్చార్జి రంగా ప్రసాద్ కి, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ స్వామి కి, డి ఈ మురళి కి, రాజేష్ ఐ కి, సత్యనారాయణ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కి, లక్ష్మీదేవి పల్లి ఎంపీడీవో కి, ఎంపీఓ శ్రీనివాసుకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్టాఫ్ కొత్తగూడెం లెక్చరర్లకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల దుమ్ముగూడెం లెక్చరర్లకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇల్లందు ప్రొఫెసర్లకు, ఇల్లందు మండల పరిషత్ అధికారులకు, ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లకు, వివిధ విభాగాల గెజిటెడ్ అధికారులకు సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం రమేష్, కే కనకదుర్గ, ఎండి కాసిం లైబ్రేరియన్, వెటర్నరీ డాక్టర్ సంతోష్, ఆనంద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *