ఆహ్లాదాన్ని పంచేందుకే ఎకో పార్కుల ఏర్పాటు -కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్ లాల్ మీనా
ఆహ్లాదాన్ని పంచేందుకే ఎకో పార్కుల ఏర్పాటు
-ఎకో పార్క్ పనుల శంకుస్థాపనలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్ లాల్ మీనా
పెద్దపల్లి, శోధన న్యూస్ : పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ ఏరియా శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాంగణంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్ లాల్ మీనా, సంస్థ ఛైర్మన్ మరియు ఎండి ఎన్ బలరామ్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఎకో పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉపరితల బొగ్గు గని ఆవరణంలో మొక్కలను నాటారు. అనంతరం శ్రీరాంపూర్ సింగరేణి ఉపరితల గని ఆవరణంలో ఏర్పాటు చేసిన సింగరేణి ఎకో పార్క్ పనులను ప్రారంభించారు. సింగరేణి సంస్థలో సింగరేణి పైపెద్దపల్లి ఆధారపడి చాలామంది నివాసిస్తున్నారని, ఆహ్లాదాన్ని పంచేందుకు సింగరేణి ఏర్పాటు చేసిన పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా అన్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామాలు చేసుకునేందుకు పార్కులో అన్ని ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. సింగరేణి ఉత్పత్తి చేసిన బొగ్గుతో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను సైతం ఏర్పాటు చేసిందని, దేశంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుందని సోలార్, జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ ఏడాదిలోపు ఇకో పార్కు శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికులకు ఉపయోగంలోకి వస్తుందని తెలిపారు. ఎ కో పార్కు లో ముఖ్య అతిథులు మొక్కలను నాటి పర్యవరణానికి మొక్కలు ఎంతో ఆవశ్యకమని తెలియజేశారు. అలాగే ఉపరితల గని వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న పని ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంస్థ డైరెక్టర్లు డిసత్యనారాయణ రావు(ఈ అండ్ ఎం), ఎన్ వి కె శ్రీనివాస్ (ఆపరేషన్స్ మరియు పర్సనల్), జి వెంకటేశ్వర్ రెడ్డి ( ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), ఏఐటియూసి అధ్యక్షులు సీతారామయ్య, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డి , జీఎం(కో ఆర్డినేషన్) ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.