తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

గిరిజన కుటుంబాల సంక్షేమానికి పాటుపడాలి  -తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గిరిజన కుటుంబాల సంక్షేమానికి పాటుపడాలి 

-తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాచలం, శోధన న్యూస్ : గిరిజన సంక్షేమానికి మరియు గిరిజనుల అభివృద్ధికి చాలా రోజులుగా సేవ చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు అధికారులకు కల్పించడం చాలా శుభసూచకమని ఆ దిశగా మనం గిరిజన కుటుంబాల సంక్షేమానికి పాటుపడాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం  ఐటిడిఏ సమావేశం మందిరములో ఏర్పాటుచేసిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో తాగునీరు, కరెంటు, రోడ్డు సౌకర్యం గిరిజన విద్యార్థిని విద్యార్థులకు నాణ్యత గల విద్య అందిస్తే గిరిజన కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తాయని, ఆ దిశగా అధికారులు చాలా కష్టపడి పనిచేసి గిరిజనుల మెప్పు పొందినప్పుడే మీరు చేసే పనికి సంతృప్తికరంగా ఉంటుందని ఆయన అన్నారు. కొండ రెడ్ల కుటుంబాలు నివసించే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రస్తుతం అశ్వరావుపేట మండలంలో పూసుకుంట గోగులపూడి గ్రామాలలో అధిక శాతం కొండరెడ్ల కుటుంబాలు ఉన్నాయని ఆ కుటుంబాలపై ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యం కల్పిస్తే సమస్య అనేది చాలా వరకు తీరిపోతుందని అలాగే గిరిజన విద్యార్థిని విద్యార్థుల కొరకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే విద్య అనేది అభివృద్ధి చెందుతుందని అందుకు నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులు మీ పరిధిలోని గ్రామాల ముఖ్యంగా గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా విద్యా వైద్యం గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు ఫారెస్ట్ కు సంబంధించిన భూ సమస్యలు గిరిజన రైతుల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ పథకాలు ట్రైకార్ ద్వారా గిరిజన యువతి యువకులకు అందజేసే పథకాలు సకాలంలో అందిస్తే గిరిజనులు ఆర్థిక అభివృద్ధి చెందడమే గాక భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా వారి కుటుంబాలను పోషించుకుంటారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *