ప్రభుత్వ పాఠశాలకు ఫ్రిజ్ వితరణ
ప్రభుత్వ పాఠశాలకు ఫ్రిజ్ వితరణ
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితిసింగారం గ్రామంలో గల జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్ధుల సౌకర్యార్ధం బుర్ర సీతారాములు యాదవ్ తన తండ్రి మల్లయ్య జ్ఞాపకార్ధంగా రూ.40వేలు విలువ చేసే ప్రిజ్ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగశ్రీకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఫ్రిజ్ను ప్రారంభించి మాట్లాడారు. రానున్న వేసవిని, విద్యార్ధుల త్రాగునీటి కోసం బుర్ర సీతారాములు ఫ్రిజ్ను అందజేయడం అభినందనీయమన్నారు. ఇందుకు గానూ సీతారాములకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దాత సీతారాములు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గాజుల పూర్ణచందర్రావు, క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ పిళ్లారిశెట్టి హరిబాబు, సభ్యులు డాక్టర్ దుస్సా సమ్మయ్య, పిఆర్సి గాజుల రమేష్ కుమార్, అడబాల నాగేశ్వరరావు, యాదవసంఘం మండల అధ్యక్షులు మార్తి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మంగి మల్లికార్జున్, గోకులకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు మిట్టపల్లి గోపి, రాబిన్ పిళ్లై, రోడ్డ సైదులు, నూకల నరసింహరావు, పాఠశాల ఉపాధ్యాయులు బి మధుకర్, పరమయ్య, బి శంకర్, ఇంద్రసేనా రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.