ఖమ్మంతెలంగాణ

అంగరంగ వైభవంగా  శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

అంగరంగ వైభవంగా  శ్రీ అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

-భక్తుల  ప్రత్యేక పూజలు 

వైరా, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా  వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది .  విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతిష్ట మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో సోమవారం గ్రామం ప్రత్యేక జాతరను తలపించింది ప్రతిష్టి అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాంతి కల్యాణం నిర్వహించారు. చుట్టుపక్కల మండలాలు గ్రామాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారు. స్వస్తిశ్రీ చాంద్రమానేన శోభాకృత నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి ఉదయం 10 26 నిమిషాలకు మృగశిర నక్షత్ర యుక్త మేష లగ్నం పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఉష్ణ వాహన శిలా ఆలయ శిఖరం విజయ్ శితల మహా చక్ర బొడ్రాయి ముత్యాలమ్మ నవగ్రహాలు ప్రతిష్టించారు. ప్రతిష్టలను బ్రహ్మశ్రీ ఇంగువ రాజేశ్వర శర్మ సిద్ధాంతి ఆచరత్వమున బ్రాహ్మణోత్తములచే జరిపించారు.ఆలయ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాజరైప్రత్యేక పూజలు నిర్వహించారు. వైరా నియోజకవర్గ ప్రజల సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ కౌన్సిలర్లు మాదినేని సునీత బత్తుల గీత దారెల్లి పవిత్ర కుమారి గద్దె నీరజ మాజీ మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్ ధ్వజస్తంభం వద్ద పసుపు కుంకుమ నవధాన్యాలతో పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమం ను శాసనసభ్యులు రాందాస్ నాయక్ నాయక్ ప్రారంభించారు.ప్రత్యేక కౌంటర్లను కట్ల రంగారావు శీలం వెంకట నర్సిరెడ్డి పొదిలి హరినాథ్ కర్ణాటి హనుమంతరావు ఏదునూరి సీతారాములు కట్ల సంతోష్ ప్రారంభించారు. మహా అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు చింత నిప్పు మురళీధర్ రావు కొల్లి వెంకటేశ్వరావు కొల్లి నాగేశ్వరరావు కొల్లి రమేష్ దొంతబోయిన వెంకటేశ్వర్లు హరికృష్ణ తదితరులు భక్తులుకు ప్రతిష్ట కార్యక్రమం తిలకించేందుకు ఎల్ఈడి సౌకర్యం ఏర్పాట్లను చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *