ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో మినీ సమావేశ మందిరం లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల విద్యా, రెవిన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, పోస్టల్, ఆర్టీసి అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. మొదటి సంవత్సరం 10200 మంది, ద్వితీయ సంవత్సరం 9277 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కనున్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహణకు 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పరిక్ష కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 16 పోలీస్ స్టేషన్స్ లో ప్రశ్న పత్రాలను భద్రపరచనున్నట్లు తెలిపారు. 36 మంది ఛీఫ్ సూపెరిండెంట్లు, 36 మంది శాఖాపరమైన అధికారులు, 13 మంది అదనపు పర్యవేక్షకులు విధులు నిర్వహించనున్నారన్నారు. మూడు సిట్టింగ్ స్క్వాడ్స్, ఐదు కస్టోడియన్స్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. 550 మంది ఇన్విజిలేటర్లుకు విధులు కేటాయించినట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి డ్యూటీ జారీ చేసినట్లు ఆమె తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, సమీపంలోని జిరాక్సు కేంద్రాలను మూసి వేయించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లుపై చెక్ లిస్టు తయారు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటుతో పాటు తగినన్ని మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర వైద్యసేవలకు వార్డులను సిద్ధంగా ఉంచాలన్నారు. పంచాయతీ, మున్సిపల్ అధికారులు పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సురక్షిత చల్లటి మంచినీరు సరఫరా చేయాలని అన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులు సకాలలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని, ఇతర డిపోల నుండి బస్సులు నడిపేందుకు ఆయా డిపో మేనేజర్లుకు లేఖలు వ్రాయాలని తెలిపారు. విద్యార్థులు బయాందోళనలకు గురికాకుండా, ధైర్యంగా పరీక్షలు వ్రాసేంందుకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలని అన్నారు. పరీక్షలు నిర్వహణలో ఎలాంటి సంఘటనలకు తావు ఇవ్వొద్దని సూచించారు. పరీక్షలకు కొద్దిరోజుల సమయం ఉన్నందున సబ్జెక్టుల్లో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. నూరుశాతం ఫలితాలు సాధించు విధంగా కృషి చేయాలని అన్నారు. పరీక్షలు నిర్వహణలో విధులు కేటాయించిన సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు షెడ్యూలు తయారు చేయాలని ఆర్ ఐఓ సులోచనారాణికి సూచించారు. పాసులు లేని వ్యక్తులను ఎట్టిపరిస్థిల్లో కేంద్రాల్లోకి అనుమతించొద్దని సూచించారు. విద్యార్థులు కానీ, విధులు నిర్వహించే సిబ్బంది కానీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలాక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడానికి అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిశిత పరిశీలన తదుపరి పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడర ని నిబంధన అమలులో ఉంటుందని ఆమె తెలిపారు. విద్యార్థులు పరీక్షల గురించిన సందేహాలు నివృత్తి కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశామని విద్యార్థులు జూనియర్ అసిస్టెంట్ బి బిక్షం 9704661714, జూనియర్ అసిస్టెంట్ ఇ శివకుమార్ 9346913069 హెల్ప్ లైన్ నెంబర్ లను సంప్రదించి పరీక్షల పట్ల ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోగలరని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణి, డిఆర్ఓ రవీంద్రనాథ్, డి ఎల్ పి ఓ రాజీవ్ కుమార్ , జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, డీఈఓ వెంకటేశ్వరా చారి, విద్యుత్ శాఖ అధికారులు వెంకటరత్నం, ప్రభాకర్ రావు, కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ విజయ బాబు, మున్సిపల్ కమిషనర్ కొత్తగూడెం శేషు, మున్సిపల్ కమిషనర్ పాల్వంచ కే మురళి తదితరులు పాల్గొన్నారు.