ఖమ్మంతెలంగాణ

పదవ ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి-వైరా ఎమ్మెల్యే  మాలోతు రాందాస్ నాయక్

పదవ ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

 -గురుకుల పాఠశాల  అభివృద్దికి కృషి

-వైరా ఎమ్మెల్యే  మాలోతు రాందాస్ నాయక్

ఏన్కూరు, శోధన న్యూస్ : త్వరలో జరిగే పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పా ఠశాలల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులందరూ ప్రణాళిక బద్ధంగా బోధిం చాలని వైరా ఎమ్మెల్యే  మాలోతు రాందాస్ నాయక్ అన్నారు.మండల కేంద్రమైన ఏన్కూరులోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలురు పాఠశాలలో డిఎంఎఫ్ టి నిధులతో నిర్మించనున్న  సిసి రోడ్డు..పాఠశాల ప్రహరీ గోడ పనులకు  ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ కు ఉపాధ్యాయులు-విద్యార్థులు పూలతో ఘనస్వాగతం పలికారు.పాఠశాల ప్రాంగణం లో ఉన్న సరస్వతి దేవి అమ్మవారి విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడు తూ..విద్యార్థులకు పదో తరగతి కీలకమైందని..వారికి సరియైన మార్గదర్శకం అంది oచడం ఉపాధ్యాయులందరి బాధ్యత అన్నారు.పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు వ్యవ ధి తక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఉపాధ్యా యులకు ఆయన సూచించారు.సబ్జెక్టు ఉపాధ్యాయులు-ప్రధానోపాధ్యాయులు స మన్వయంతో పని చేసినప్పుడే లక్ష్య సాధించగలమన్నారు. ప్రతి విద్యార్థి ఫలితాలపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలన్నారు.పి ల్లల చదువు విషయంపై తల్లిదండ్రులతో చర్చించాలని ఆయన అన్నారు.మండల ప్ర త్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహకారాన్ని అందిం చాలని ఆయన అన్నారు.పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా బోధన జరగాలన్నారు. ప్రతి విద్యార్థి పద వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉ త్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ఆయన కోరారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కు పునాది పదో తరగతేనని..కళాశాల విద్య మొదటి మెట్టు అని పేర్కొన్నారు.  పదో తరగతి లో అత్యుత్తమ మార్కులు సాధించి విద్యార్థి జీవితంలో పొందేటటువంటి మొట్టమొదటి పట్టాను ప్రశంసనీయంగా చూసుకోవాలని ఆయన అన్నారు.ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఏన్కూరులోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలుర పాఠ శాల సమస్యల పరిష్కారానికి, అభివృద్దికి  తన వంతు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు..పైతరగతుల్లో రాణించి పెద్ద పెద్ద ఆఫీస ర్లు గా చాలామంది ఉద్యోగులుగా తయారుచేసిన పాఠశాలని ఆయన కొనియాడా రు.  నియోజకవర్గం లోని అన్ని పాఠశాలలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాదావత్తు బుజ్జి, ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, ఏన్కూరు-జూలూరుపాడు సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, లేళ్ల వెంకటరెడ్డి,నాయకులు వేముల కృష్ణ ప్రసాద్, వాసిరెడ్డి నాగేశ్వరరావు,బాదావ త్తు బాలాజీ,భూక్యా లాలూ నాయక్,దళపతి భువనేశ్వర్ రాజు,స్వర్ణ ప్రహ్లాద రావు, పూర్ణ కంటి మైసవరావు,శోభన్ నాయక్, సాయి రోహిత్, ముక్తి వెంకటేశ్వర్లు,గిద్ద గి రి సత్యనారాయణ,పటాన్ మజీద్ ఖాన్, చింతన పోయిన సీతారాములు, ముక్తి ల క్ష్మీనారాయణ,రవి, సైదులు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తుడి శ్రీనివాసరెడ్డి, ఏ టీపీ స్వప్న, ఉపాధ్యాయులు శారా స్వప్న,విజయ కుమారి, శ్రీనివాస్,రవికుమార్, హిమాం,అంజిత్ పాషా,సునీల్, శ్రీనివాస్ రెడ్డి,మోహన్,కృష్ణ,తదితరులు పాల్గొన్నా రు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *