సమన్వయం తో ఎన్నికల విధులు నిర్వర్తించాలి -మహబూబాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్
సమన్వయం తో ఎన్నికల విధులు నిర్వర్తించాలి
-మహబూబాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్
మహబూబాబాద్, శోధన న్యూస్ : రాబోయే పార్లమెంటు ఎన్నికలలో సమన్వయం తో ఎన్నికల విధులు నిర్వర్తించాలని, పోలీస్ శాఖ అధికారుల సిబ్బంది సహకారం ఎంతో అవసరమని మహబూబాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయ సమావేశ మందిరంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల విధుల నిర్వహణపై అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 16వ పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణకు పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని తెలిపారు. స్ట్రాంగ్ రూముల నుండి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రి పంపిణీ పోలింగ్ కేంద్రాల కు తరలింపు భద్రతతో కూడిన అంశాలుగా పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్ల లో అందించే వరకు అనంతరం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే వరకు పోలీసు బందోబస్తు సిబ్బంది విధులు ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచారంలో చెక్ పోస్ట్ ల వద్ద వాహనాల చెకింగ్ ర్యాలీలు సమావేశాలు పైనిగా పెంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా బాధ్యతతో కూడిన విధులు పోలీస్ అధికారులకు ఉంటాయన్నారు. విధులను నిర్వర్తించే పోలీస్ అధికారులకు సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తామన్నారు. అదనపు ఎస్ పి చెన్నయ్య మాట్లాడుతూ… చెక్ పోస్ట్ లలో సిబ్బంది తప్పనిసరిగా విధులలో ఉండాలని అన్నారు వాహనాల చెకింగ్ లో పారదర్శకత పాటించాలన్నారు. ర్యాలీలు, సమావేశాలు ప్రతి ఒక్కటి ఎన్నికలలో రికార్డు చేయబడతాయని ఎన్నికల అధికారులకు సహకరించాలన్నారు. అధికారులందరూ టీం వర్క్ గా పనిచేసి సమన్వయంతో ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సిఐలు సత్యనారాయణ, సంజీవ్, ఎస్ఐలు రియాజ్ పాషా, ఝాన్సీ, డిఎల్ఎంటి లు రాములు, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.