Mahabubabadతెలంగాణమహబూబాబాద్

ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిశీలన చేయాలి

ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిశీలన చేయాలి

-మహబూబాబాద్  జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, శోధన న్యూస్  : ధరణిలో స్వీకరించిన పెండింగ్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టాలని మహబూబాబాద్  జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెవెన్యూ అధికారుల ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం పై అదనపు కలెక్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం చేపట్టాలని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని నివేదికలు అందజేయాలన్నారు. సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ స్వయంగా పరిశీలన చేయాలని తాసిల్దార్ తుది నివేదిక ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించే బృందంలో తాసిల్దార్ సర్వేయర్ పంచాయతీ సెక్రెటరీ ఆర్ ఐ తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో కేసముద్రం గూడూరు మహబూబాబాద్ నెల్లికుదురు తదితర మండలాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అధికారులు సమగ్ర నివేదికకు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి పురుషోత్తం, ఏడి సర్వేయర్ నరసింహమూర్తి, తహశీల్దారులు, డిప్యూటీ తహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *