తెలంగాణరాజన్న సిరిసిల్ల

పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు

పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు
-విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలి
-పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
-నాంపల్లి గుట్ట మీద కమ్యూనికేషన్ రిపిటర్ ప్రారంభం

వేములవాడ, శోధన న్యూస్ : పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకునేందుకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కి అనుబంధంగా నిర్మించిన గదులతో పాటు మారుమూల ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలు అందించడానికి నాంపల్లి గుట్ట మీద ఏర్పాటు చేసిన రిపిటర్ ను శుక్రవారం ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించాడు. అనంతరం నాంపల్లి గుట్ట మీద ఉన్న శ్రీ లక్ష్మి నరసింహా స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో పోలీస్ సేవలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచుకునేందుకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కి అనుబంధంగా నిర్మించిన స్టేషన్ గదులను ప్రారంభించడం జరిగిందని అన్నాడు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ ప్రజలతో స్నేహపూర్వకంగా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖలో విప్లవాత్మకంగా మార్పులు రావడం జరిగిందని, జిల్లాలో మారుమూల ప్రాంతాలకు పోలీస్ కమ్యూనికేషన్ సేవలు నిరంతరం అందించడానికి నాంపెళ్లి గుట్ట మీద కమ్యూనికేషన్ రిపిటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీని వల్ల పోలీస్ సిబ్బంది జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న ఎలాంటి అవాంతరాలు లేకుండా కమ్యూనికేషన్ సెట్ సాయంతో ఎక్కడి నుండి ఎక్కడికైనా మాట్లాడవచ్చని తెలిపాడు. ఆయన వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిఐలు కరుణాకర్, శ్రీనివాస్, కమ్యూనికేషన్ సిఐ శ్రీలత పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *