మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవండి
మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవండి
-చర్ల పోలీస్ శాఖ విజ్ఞప్తి
చర్ల, శోధన న్యూస్ : కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ తెలంగాణలో మనుగడని ఎప్పుడో కోల్పోయింది.మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం పని చేసే నాయకులు,దళ సభ్యుల కోసం వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికైనా మీ కుటుంబ సభ్యుల కోసం మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము.లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల ప్రతిఫలాలను అందజేసి,పునరావాసం కల్పించే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాము.