క్రీడలతో మానసిక ప్రశాంతత -అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు కృషి
క్రీడలతో మానసిక ప్రశాంతత
-అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు కృషి
-జర్నలిస్టు కప్ టోర్నమెంట్ ని ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పినపాక, శోధన న్యూస్ : క్రీడలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోపాలరావు పేట గ్రామంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే జర్నలిస్టు కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బ్యాటింగ్, బౌలింగ్ చేసి కాసేపు ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జర్నలిస్టులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ టోర్నమెంట్ లో ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఫారెస్ట్, ఉపాద్యాయులు, ఫోస్టల్ ఉద్యోగులు, బిటిపీఎస్ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, డాక్టర్స్ ఇలా అన్నీ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం వలన అన్ని శాఖల ఉద్యోగులు స్నేహ భావంతో విధులు నిర్వహించవచ్చని అన్నారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, అందరూ కలిసిమెలిసి స్నేహ భావంతో క్రీడలలో పాల్గోనాలని అన్నారు. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను కృషి చేశానని, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత తనదేనని అన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టులకు అండగా ఉంటానని, త్వరలో నియోజకవర్గంలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ కరుణాకర్, ఎస్సై వెంకటప్పయ్య, వైస్ ఎంపిపి కింది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, యువజన నాయకులు కొర్సా ఆనంద్, గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉడుముల రవీందర్ రెడ్డి, పాత్రికేయులు బిల్లా నాగేందర్, బూరా శంకర్, కీసర సుధాకర్ రెడ్డి, సనప భరత్, బృహస్పతి, సంతోష్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.