తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సీఎం పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేయండి

సీఎం పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేయండి

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కోత్తగూడెం, శోధన న్యూస్:ఈ నెల 11న జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్, ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్ లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. రామాలయ దర్శనం అనంతరం జిల్లాలోని అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ కు గిరిజన భవన్ లో అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఎంపిక చేసిన సభ స్థలంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టాలన్నారు.రామాలయ దర్శనం, హెలిపాడ్ నిర్మాణం, సభాస్థలికి ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు, సభకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. సభా ప్రాంగణంలో హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయాలని అగ్నిమాపక దళం సిద్ధంగా ఉండాలన్నారు.
అనంతరం జిల్లాలో జరిగే అన్ని అభివృద్ధి పనులు పురోగతిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ధరణి, ఎల్లారెస్, ప్రజా పాలన కు మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది అర్హులు ఉన్నారు అన్ని వివరాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ లక్ష్మీ గృహ జ్యోతి పథకాలకు మొత్తం వచ్చిన దరఖాస్తులు మరియు మొత్తం లబ్ధిదారుల వివరాలను సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్య మరియు వైద్య శాఖలకు ఇప్పటివరకు మంజూరు అయిన నిధులు చేపట్టిన పనులు, మన ఊరు మనబడి, జిల్లాలోని అన్ని పాఠశాలలు అంగన్వాడీ, కేంద్రాలలో చేపట్టిన అభివృద్ధి పనులు పై నివేదికలను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. శ్రీరామ నవమి నాటికి భద్రాచలం వద్ద నిర్మిస్తున్న రెండవ వంతెన పనులు పూర్తి అవ్వాలని అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని నేషనల్ హైవే అధికారులు ఆదేశించారు. వేసవిలో మంచినీటి సమస్యలు తలెత్తకుండా తీసుకునే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మిషన్ భగీరథ అధికారులు ఆదేశించారు. భద్రాచలం రామాలయ పరిధిలోని భూముల వివరాలు మరియు భద్రాచల రామాలయ అభివృద్ధి కొరకు చేపట్టవలసిన అభివృద్ధి పనులు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని రామాలయ ఈవో రమాదేవి ను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. నేటి సాయంత్రం లోగా అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనుల పురోగతిపై నివేదికలు సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు జిల్లాలో ఇప్పటివరకు ఇచ్చిన పోడు పట్టాల సంబంధించిన వివరాలను నివేదిక అందజేయాలని డీఎఫ్ కృష్ణ గౌడ్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ పి డి విద్యాచందన, డిఆర్ఓ రవీందర్ నాథ్, జిల్లా పరిపాలన అధికారి గ న్య, డి ఎం హెచ్ ఓ శిరీష, డీఎస్ఓ రుక్మిణి, భద్రాచలం ఆర్టీవో కే దామోదర్ రావు, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆర్ అండ్ బి ఈఈ అర్జున్, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాస్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *