తెలంగాణబూర్గంపాడుభద్రాద్రి కొత్తగూడెం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 

బూర్గంపాడు, శోధన న్యూస్ : మహిళలు వంటింటికే పరిమితం కాకుండా చైతన్యంతో ముందుకెళ్తే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు. పినపాక బి బ్లాక్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బర్ల నాగమణి ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మహిళా కాంగ్రెస్ పార్టీ తరఫున దేవి ప్రసన్నకు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ మహిళలంతా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు రావాలని గతంలో మహిళల్లో చదువుకు ఆదరణ కు దూరంగా ఉండే వారు కాలం మారినకొద్దీ పురుషులతో సమానంగా పోటీపడి ప్రతి రంగంలో ముందుంటున్నారన్నారు.సృష్టికి మూలమైన మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు, మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని మగవాళ్లకి ధీటుగా అన్ని రంగాలలో రాణించాలని కోరుతున్నారు, అదేవిధంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు మహిళలుకు మరిన్ని పదవులు ఇచ్చి గౌరవాన్ని తెచ్చి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూక్య సుగుణ, మణుగూరు మండల అధ్యక్షులు కూరపాటి సౌజన్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ దివ్య ,బంధాల సరిత ,సంధ్యా, పద్మ ,అవని ,మాజీ మండల అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్ రెడ్డి ,ప్రవీణ్ , టౌన్ అధ్యక్షుడు మంద నాగరాజు, భద్రాచలం మహిళా కాంగ్రెస్ రాజేశ్వరి కుమారి, జయ ,హాసిమా, కళ్యాణి,n. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *