ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ఐ డి ఓ సి కార్యాలయం సమావేశపు హాలులో శుక్రవారం ధరణి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మీసేవ ధ్రువీకరణ పత్రాలు, సీతమ్మ సాగర్, ఇసుక రీచ్ లు, అటవీ భూములు తదితర అంశాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై రెవెన్యూ,అటవీ,సర్వే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి ఫిర్యాదు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయాలని కూలంకషంగా పరిశీలించిన తదుపరి మాత్రమే సిఫారసు చేయాలన్నారు. రానున్న ఏడు రోజుల్లో పెండింగ్ లో ఉన్న ధరణి ఫిర్యాదులన్నిటిని క్లియర్ చేయాలని సూచించారు. దరఖాస్తు తిరస్కరణకు గురైన పక్షంలో అందుకు గల కారణాలను చెక్ లిస్టులో నమోదు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో పరిశీలన చేయాలని సూచించారు. పార్టిషన్ ఫైలు తనిఖీ చేస్తామని పొరపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఫిర్యాదు నిర్దేశించిన సమయంలో గా పరిష్కరించాలన్నారు. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో ధరణి అప్లికేషన్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలని ప్రతి అప్లికేషన్ ఇన్ మరియు అవుట్ తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, మీసేవ పెండింగ్ దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లోని తాసిల్దారులు ఆర్డీవోలు తమ పరిధిలోని దరఖాస్తులన్నీ పది రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రజలు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికై దూర ప్రాంతాల నుండి ప్రజావాణి కి వస్తున్నారని మీ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదన్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో పెండింగ్ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని ఎందుకు ఎన్ని పెండింగ్ ఉన్నాయని అధికారులను ప్రశ్నించారు సోమవారం కల్లా అన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు ప్రాజెక్టులకు అవసరమైన పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ల్యాండ్ బ్యాంక్ కు ఇచ్చిన భూముల్లో ఆక్రమణ లకు గురైతే సర్వే నెంబర్లతో సహా నివేదికలు అందజేయాలని చెప్పారు. కోర్టు కేసులకు జాప్యం చేయక సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పూర్తి చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 18వ తారీకు నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలు అన్నిటిని ఏర్పాటు చేయాలన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ సాండ్ కమిటీ ద్వారా ఇప్పటివరకు తొమ్మిది ఇసుక రీచ్లకు అనుమతి ఇవ్వడం జరిగిందని, రానున్న రెండు రోజుల్లో ఇంకో రెండు ఇసుక రీచ్లకు అనుమతి మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇసుక కావలసినవారు మన ఇసుక వాహనం https://tsmiv.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని తెలిపారు. వినియోగదారుని ఫోన్ నెంబర్ ఓటిపి ద్వారా బుకింగ్ జరుగుతుందని, ఆన్లైన్ పేమెంట్ తదుపరి వినియోగదారుడు కి బుకింగ్ కి సంబంధించిన మెసేజ్ ఫోన్ కి వస్తుందని తమ యొక్క బుకింగ్ ట్రాకింగ్ చేసుకోవచ్చు అని కలెక్టర్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇసుకరీచుల్లో ఉదయం నుండి సాయంత్రం 6:00 వరకు మాత్రమే లోడింగ్ అనుమతి ఉంటుందని ఆమె తెలిపారు. ప్రతి ఈ స్కరీచుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇసుక సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలను నివృత్తి కొరకు 08744 241950 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అటవీ శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారానికై అటవీ, రెవెన్యూ మరియు సర్వే జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వారి సంతకాలతో కూడిన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ పోడు పట్టాలు ఉన్నవారు తప్ప కొత్తగా పోడు వ్యవసాయం కోసం చెట్లను ఎవరు కొట్టకూడదని అలా చెట్లను నరికిన యెడల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రెవెన్యూ అధికారులు గిరిజనులకు పోడు వ్యవసాయం మీద అవగాహన కల్పించాలని కొత్తగా పోడు ఎవరు కొట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రవీంద్రనాథ్, ఆర్డీవోలు మధు, దామోదర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఏవో గన్య మరియు అన్ని మండలాలు తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.