తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

వస్తువు కొనుగోలుకు రసీదు తప్పనిసరి 

వస్తువు కొనుగోలుకు రసీదు తప్పనిసరి 

-జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణి  

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : వినియోగదారులందరూ తాము కొనుగోలు చేసిన వస్తువులకు విధిగా బిల్లులు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణి సూచించారు.  జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు తప్పనిసరిగా బిల్లు  తీసుకోవాలని, కొనుగోలు చేసిన వస్తువు ఏదైనా చెడిపోతే వినియోగదారుల హక్కు ఫోరంలో ఫిర్యాదు చేసి తమకు జరిగిన నష్టాన్ని తిరిగి పొందవచ్చని తెలిపారు. మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేసినప్పుడు విధిగా బిల్లు తీసుకోవాలని కోరారు. అనంతరం తూనీకలు, కొలతలు శాఖల అధికారి మనోహర్ మాట్లాడుతూ వస్తువు తూకంలో వినియోగదారులు నిశితంగా పరిశీలించాలని చెప్పారు. తూకాలలో మోసపోవద్దని వస్తువు కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు . వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు కొలతల పరికరాలకు సకాలంలో ముద్ర వేయించుకొని లైసెన్స్ తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలోని రైతులందరికీ వినియోగదారుల హక్కులు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ  సమావేశంలో డిఎం సివిల్ సప్లై త్రినాథ్ బాబు, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, అసిస్టెంట్ ఇన్ ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ కరంచంద్,కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ గుగులోతు బాలు, రాజ్ పుత్ ఆర్గనైజేషన్ కొత్తగూడెం శ్రీమతి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *