Uncategorized

ఏలూరు  శ్రీనివాసరావు కి ఆత్మీయ  సన్మానం

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు  శ్రీనివాసరావు కి ఆత్మీయ  సన్మానం

–   టెక్నాలజీ తో పోటీపడి  మహిళలు అన్ని రంగాలలో ముందంజ 

కొత్తగూడెం, శోధన న్యూస్ : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు వేడుకలు కొత్తగూడెం క్లబ్ లో అధ్యక్షులు సంఘం వెంకట పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు నేటి పోటీ ప్రపంచంలో టెక్నాలజీ తోని పోటీపడి మరి అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారని మహిళలు ఉద్యోగాలలో రాజకీయాలలో కుటుంబ పోషణలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని ఉద్యోగస్తులైన మహిళా అధికారులు తమ ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ పోషణ కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారని వారి సహకారం ఓపికకు చేతులెత్తి మొక్కలని సూచించారు.అందరూ మహిళలకు కుటుంబ వ్యవహారాలలో ఉద్యోగ వ్యవహారాలలో సహకరించి వారికి ఉన్న సమస్యలను అర్థం చేసుకొని ముందుకు సాగాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా అధికారులలో సగభాగం మహిళలు ఉండటం జిల్లా పాలనాధికారిగా మహిళా జిల్లా నీ ముందుకు నడిపించడం పట్ల జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో గెజిటెడ్ అధికారులు నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని వారందరి సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో నడుస్తుందని వివరించారు. మహిళా అధికారులకు రావలసిన కల్పించవలసిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం గెజిటెడ్ అధికారులు సమావేశం కావడానికి వారి సమస్యలను చర్చించడానికి కనీసం యూనియన్ కార్యాలయాలు కూడా అందుబాటులో లేవని వాటిని ప్రభుత్వం మంజూరు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధికారులకు వివిధ డిపార్ట్మెంట్లో పని చేసే మహిళా అధికారులకు వారి సేవలను గౌరవిస్తూ సన్మానించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న పేద మహిళ విద్యార్థులకు సుమారు 40 మందికి నూతన వస్త్రాలు టీజీవో తరఫున బహకరించటం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో గెజిటెడ్ అధికారులు నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగులు అన్ని సంఘాల నాయకులు సభ్యులు ఏలూరు శ్రీనివాసరావు ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారులు డాక్టర్ పి విజయ్ కుమార్ కార్యదర్శి కష్టాల వెంకటేశ్వర్లు కోశాధికారి బీదస్రు అసోసియేషన్ అధ్యక్షులు అబ్రహం డివిజన్ అధ్యక్షులు జై తిరుపతి కార్యదర్శి ఎన్ కనకదుర్గ మహిళా అధ్యక్షురాలు జిల్లా అధికారులు దుర్గమ్మ రుక్మిణి దేవి విజేత తిరుమలేష్ యు శ్రీనివాస్ ధన్సింగ్ ఎం శ్రీనివాస్ మోదుగ వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా టీజీవో కార్యదర్శి యాదాద్రి టీఎన్జీవో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అమర్ నేను రామారావు కార్యదర్శి చైతన్య భార్గవ్ వివిధ సంఘాల ఉద్యోగ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *