తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

లోక్ సభ ఎన్నికల పై నోడల్ అధికారి శిక్షణ

లోక్ సభ ఎన్నికల పై నోడల్ అధికారి శిక్షణ

భద్రాద్రి  కొత్తగూడెం, శోధన న్యూస్: లోక్ సభ ఎన్నికలు – 2024 నకు సంబందించి ఎన్నికల కోడ్ అమలు అయినందున జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక అల ఆదేశాల మేరకు  సమీకృత జిల్లా అధికారుల కార్యాలయము- భద్రాద్రి కొత్తగూడెం లో  శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎక్స్పెండీచర్  నోడల్ అధికారి సయ్యద్ ఖుర్షీద్ ఆధ్వర్యంలో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లందు , పినపాక నియోజకవర్గముల యొక్క అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ అబ్సర్వర్లు, అకౌంటింగ్ టీం, వీడియో వ్యూవింగ్ టీం లకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  ఇందులో భాగంగా ఎఫ్ఎస్టీ, ఎస్ ఎస్ టి  టీంలను ప్రతిరోజూ మానిటరింగ్ చేయాలని, ఎన్నికల వ్యయo ఇతరత్రా అంశాలను సునిశితంగా పరిశీలించాలని తెలిపారు. ఈ   శిక్షణకు జిల్లా ఎన్నికల ట్రైనింగ్ నోడల్ అధికారి ఎండి.అలీం తో పాటు అన్ని నియోజకవర్గముల అసిస్టెంట్ఎక్స్పెండీచర్ అబ్సర్వర్లు, అకౌంటింగ్ టీం, వీడియో వ్యూవింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *