పౌష్టికాహారం ప్రాధాన్యత ను గుర్తించాలి
పౌష్టికాహారం ప్రాధాన్యత ను గుర్తించాలి
ములుగు,శోధన న్యూస్: ప్రస్తుత వేసవి కాలంలో గ్రామాలలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి సరఫరా లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. శుక్రవారం ఎస్ఎస్ తాడ్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ త్రాగు నీటి సరఫరా తీరు పై మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో నీటి ఇబ్బందులు తీవ్రం గా ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడానికి ప్రతి గ్రామ పంచాయితి కి సూక్ష్మ ప్రణాళిక తయారు చేయాలని స్థానికం గా ఉన్న పరిస్థితుల పై అవగాహన ఏర్పరచు కొని తగు పరిష్కార మార్గాలతో సిద్దం గా ఉండాలన్నారు. తక్కువ నీరు వచ్చే ప్రాంతాలను గుర్తించి చేతి పంపు లకు మనమతులు చేయాలని, రాబోయే మూడు నెలల లో గ్రామాలలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఐసిడిఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోషణ పక్షం కార్యక్రమం లో శ్రీజ పాల్గొని మాట్లాడుతూ పౌష్టికాహారం ప్రాధాన్యత ను ప్రతి ఒక్కరూ గుర్తించి మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని అన్నారు. రోజు తీసుకునే ఆహారంలో మంచి పోషక విలువలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మహిళా సాధికారిత యొక్క ముఖ్య ఉద్దేశం గురించి గర్భిణీలకు, బాలింత స్త్రీలకు వివరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.