అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
-ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం ,శోధన న్యూస్: చెక్‌పోస్ట్‌ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. చెక్ పోస్టు ఏర్పాట్లు, వాహనాల తనిఖీ రిజిష్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తణిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలన్నారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని తెలిపారు. వాహనాల తనిఖీ సంబంధించి రిజిస్టర్ లో ఏ వాహనం, నెంబరు, సమయం నమోదు చేయాలన్నారు. ప్రతి చెక్ పోస్ట్ లో వీడియోగ్రఫీ కి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అప్రమత్తంగా వుంటూ 24 గంటల పటిష్ట నిఘా పెట్టాలని అన్నారు.