ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జన్మదిన వేడుకలు
ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జన్మదిన వేడుకలు
కరకగూడెం,శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తో కేక్ కట్ చేయించి,కమిటీ సభ్యులందరూ కలిసి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సుఖ సంతోషాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు ,పాల్గొన్నారు.