పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జనగామ ,శోధన న్యూస్: పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఘన్పూర్ లో గల బాలిక ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పదవ తరగతి పరీక్షలలో భాగంగా మూడవ రోజున మొత్తం 41 పరీక్షా కేంద్రాలలో జరిగిన గణితం పరీక్షలో జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 6698 మంది విద్యార్థులకు గాను 6692 మంది హాజరయ్యారని, 06 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని హాజరు శాతం 99.9 శాతంగా ఉందని కలెక్టర్ కు వివరించారు. పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, సజావుగా నిర్వహిస్తున్నామన్నారు.