టీబి రహిత సమాజం నెలకొల్పాలి
టీబి రహిత సమాజం నెలకొల్పాలి
-జిల్లా వైద్యాధికారి కళావతి బాయి
మహబూబాబాద్,శోధన న్యూస్: టీబి రహిత సమాజం నెలకొల్పాలని మహబూబాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐడిఓసి లోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థలతో పాటు మిగిలిన అన్ని శాఖల సహకారంతో టి బి రహిత సమాజం కోసం పాటుపడాలని పేర్కొన్నారు. గ్రామాలలో నిర్వహించే వి హెచ్ యన్ డి రోజున క్షయ వ్యాధి, లక్షణాలు, నివారణ, పూర్తి చికిత్స పై అవగాహన కల్పించాలని, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఆర్ బి ఎస్ కే టీములు పాఠశాలలను సందర్శించినప్పుడు విద్యార్థులలో కూడా క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలని, ప్రతి మంగళవారము , గురువారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమాలలో మహిళలకు ఒక్క ఊపిరితిత్తుల ద్వారా వచ్చే క్షయ వ్యాధి కాకుండా శరీరంలోని ఏ భాగానికైనా క్షయ వ్యాధి సోక వచ్చుననే విషయాన్ని అవగాహన కల్పించాలన్నారు. ముందుగా క్షయ నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మురళీధర్ జిల్లాలో ఎనిమిది మైక్రోస్కోపిక్ సెంటర్లు, ఐదు టీబీ యూనిట్లు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిబీ నాట్ ద్వారా క్షయ వ్యాధి నియంత్రణకుపాటుపడుతున్నామని, వైద్య ఆరోగ్య శాఖలోని క్షేత్రస్థాయి సిబ్బంది గృహ సందర్శన చేసినప్పుడు క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి తెమడ పరీక్ష చేయించి, వంద శాతం నూతన కేసులను గుర్తించి పూర్తిస్థాయి చికిత్సను అందచేయాలని పేర్కొన్నారు.

