తెలంగాణసంగారెడ్డి

మీడియా సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

మీడియా సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

సంగారెడ్డి ,శోధన న్యూస్: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్,మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ కమిటీ ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా  కలెక్టర్ క్రాంతి వల్లూరు , అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి పరిశీలించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను , ఎంసిఎంసి పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. మెదక్ , కామారెడ్డి జిల్లాల ఎం.సి.ఎం.సి నొడల్ అధికారులతో కలిసి ఎప్పటికపుడు మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ, సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం,పత్రికల్లో ప్రచురించిన రాజకీయ ప్రకటనలు అభ్యర్థి ఎన్నికల వ్యయం లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. శాటి లైట్ ఛానల్ లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా, ఈ పేపర్ లో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్, వాయిస్ మెసేజ్ లు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా రాజకీయ ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *