పోషణ పక్షోత్సవాల్లో మొదటి స్థానం కరీంనగర్ దే
పోషణ పక్షోత్సవాల్లో మొదటి స్థానం కరీంనగర్ దే
–కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ ,శోధన న్యూస్: పోషణ పక్షోత్సవాల్లో మొదటి స్థానం కరీంనగర్ దే అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోషణ పక్షోత్సవాల్లో మొదటి స్థానం కరీంనగర్ దే అని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవాలు శనివారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంతో పాటు ప్రాజెక్టు, మండల, గ్రామ స్థాయిలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసంతో పాటు పోషకాహారం గురించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణ వివరాలను సూచించే ఆన్‌లైన్ సైట్‌లో తెలంగాణలో కరీంనగర్ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, పౌర సరఫరాల శాఖ , విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని యుక్త వయస్సు వరకు తీసుకోవాల్సిన ఆహారం గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కిశోర బాలికలు ఎంత మోతాదులో ఏయే అహారం తీసుకోవాలో ఐ.సి.డి.యస్ అధికారులు వివరించారు.
గిరిజన సాంప్రదాయ, ప్రాంతీయ, స్థానిక ఆహార పద్ధతులు అందులో ఉండే విటమిన్ల గురించి సమాచారాన్ని వివరించారు. అంగన్వాడి కేంద్రాల పరిధిలో గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టిన గంటలోపు శిశువు ముర్రుపాలు పట్టించవలసిన ఆవశ్యకతను, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు, 7 వ నెల నుండి తల్లిపాలతో పాటుగా ఇవ్వవలసిన అనుబంధ ఆహారం గురించి తల్లిదండ్రులకు సూచించారు. చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన సదస్సులతో వివరించారు. కేవలం ఆడవారికే కాకుండా పోషకాహారం ప్రాధాన్యతను తెలుసుకునేలా మగవారికి వంటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లాలో పెద్దఎత్తున నిర్వహించిన పోషణ పక్షోత్సవ కార్యక్రమాల నిర్వహణ వివరాలను సూచించే ఆన్‌లైన్‌లో తెలంగాణలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలించిందన్నారు.