తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

విధి నిర్వహణ లో భద్రతే కీలకం 

విధి నిర్వహణ లో భద్రతే కీలకం 

-డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్  రాజగోపాల్

మణుగూరు, శోధన న్యూస్: విధి నిర్వహణ లో భద్రతే కీలకం అని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్-హైద్రాబాద్  బి  రాజగోపాల్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) లో 53 వ జాతీయ భద్రతా వారోత్సవాలు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి రాజగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కర్మాగారంలో అమలవుతున్న భద్రత ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. భద్రత అనేది ఉద్యోగుల జీవన విధానం కావాలని సూచించారు. కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న బీటిపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతకు సంస్థ అధిక ప్రాధాన్యతిస్తుందని పేర్కొన్నారు. జీరో యాక్సిడెంట్ లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అనంతరం భద్రత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, స్లోగన్ రైటింగ్, కార్టూన్ పోటీల్లోనే విజేతులకు బహుమతి ప్రధానం చేశారు.సేఫ్టీ డిఈ ఆనంద ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కర్మాగార సూపర్డెంట్ ఇంజనీర్లు రమణమూర్తి,పార్వతి, రమేష్ బాబు, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బాబురావు విజిలెన్స్ డిఎస్పి రమేష్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *