కార్మికుల శ్రేయస్సే బిఎంఎస్ లక్ష్యం
కార్మికుల శ్రేయస్సే బిఎంఎస్ లక్ష్యం
-బిఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్
హైదరాబాద్, శోధన న్యూస్: కార్మికుల శ్రేయస్సు సే లక్ష్యంగా బిఎంఎస్ ముందుకు సాగుతుందని ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ ప్రదీప్ కుమార్ అన్నారు. జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కార్మికుల స్థితిగతులు దిగజారుతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చే కనీస వేతనాల జీ.వోలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందని,కార్మిక సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.