వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-రాష్ట్ర స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ములుగు,శోధన న్యూస్: ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు మండిపోతు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అన్నారు. ఎండ ప్రభావం తీవ్రత అధికంగా నమోదవ్వడం జరుగుతున్నదని, ఎండ ప్రభావం వృద్ధులు, చిన్న పిల్లలపైన పడుతుందని అన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు అత్యవసరం అయితేనే ఇంటి నుండి బయటకు రావాలని సూచించారు. కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకొని ఇంటికి, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతున్నదని సీతక్క తెలిపారు.