విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలి
విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలి
-ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం ,శోధన న్యూస్: ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలని, పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పి లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. కలెక్టర్, చింతకాని మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు చేపడుతున్న డిజిటల్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 3, కస్తూరిబా బాలికల విద్యాలయాలకు 6 చొప్పున, ఉన్నత ప్రాధమికొన్నత పాఠశాలలకు ఒకటి చొప్పున ఐఎఫ్పి లను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠాల బోధన, డిజిటల్ తరగతుల ద్వారా సులభంగా అర్థం అవుతుందని, ఉపాధ్యాయులకు బోధన కూడా సులువు అవుతుందన్నారు. పరీక్షా కేంద్రంలో మౌళిక సదుపాయాలకల్పన ను తనిఖీ చేశారు. పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల రవాణా పకడ్బందీగా చేయాలని అధికారులను సూచించారు.