తెలంగాణమహబూబాబాద్

 మండు వేసవిని అధిగమిద్దాం

 మండు వేసవిని అధిగమిద్దాం

-మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్ ,శోధన న్యూస్: ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం అని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యల జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ తో కలిసి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అధిక ఉష్నోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందని దీనిపై ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అందులో భాగంగా మునిసిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్ని మునిసిపాలిటీలల్లో స్వచ్చంద సేవా సంస్థల సహకారంతో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఏ.ఎన్.ఎం.లతో సమన్వయం చేసుకుని వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పించేలా, అలాగే తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వేసవిలో విద్యుత్ అవసరం అధికంగా ఉంటుంది కావున అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని గ్రామీణాభివ్రుద్ది అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే పని వేళల్లో మార్పులు పరిశీలించాలన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆయా అంగన్వాడీ వేసవి వడగాల్పుల పై సిడిపిఓ, సూపర్వైజర్లు, అంగన్వాడి వర్కర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణీల సౌలభ్యం కోసం ముందస్తుగా ఓ.ఆర్.ఎస్. సంబందిత ద్రావకాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి ఎలాంటి కొరత లేకుండా ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వడగాల్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అటవీ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా.. అక్కడక్కడా నీటి తొట్టెలు ఏర్పటు చేసి నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆటవీశాఖాధికారులను ఆదేశించారు. ప్రత్యేక జాగ్రత్తలతో పశువుల పెంపకాలను చేపట్టేందుకు పశువుల కాపర్లకు తగిన సూచనలను కరపత్రాల రూపంలో గ్రామాల్లో అవగాహన చేపట్టాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రమాదాల నివారణకు అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోని.. పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా మున్సిపల్ కమీషనర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వడదెబ్బ, అతిసారం లాంటి సమస్యలపై వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు వెంటనే స్పందిస్తూ తక్షణ సేవాలందించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *