తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

శిక్షణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

శిక్షణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: పార్లమెంటు ఎన్నికల్లో విధులు నిర్వహించు సిబ్బంది ఈవియం, వివిప్యాట్ల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు . సోమవారం కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల మరియు లక్ష్మిదేవిపల్లి మండలం శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నందు శిక్షణా తరగతులను ఆమె పరిశీలించారు. పోలింగ్ విధులు నిర్వహించు సిబ్బందికి ఫారం 12, ఫారం 12-ఏలను శిక్షణా కార్యక్రమాలు నిర్వహించు కేంద్రాలలో అందచేస్తున్నట్లు చెప్పారు. విధులు నిర్వహించు సిబ్బంది అదే నియోజకవర్గంలో విధులు కేటాయించినట్లయితే వారు ఈడిని తీసుకోవడం ద్వారా (ఎన్నికలు విధులు ధృవీకరణ పత్రం) ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఫారం 12ఏలను అందచేయాలని చెప్పారు. ఓటు ఉన్న పార్లమెంటు నియోజకవర్గం కాకుండా మరొక నియోజకవర్గంలో విధులు కేటాయించినట్లయితే అటువంటి వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఫారం నెంబరు 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈవియంకు వివిప్యాట్లు అనుసంధానం చేయడంపై అవగాహన కల్పిస్తున్నామని సిబ్బంది ఇట్టి విషయంలో పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లు వివరాలను ప్రిసైడింగ్ అధికారులు 17 సి ద్వారాను, రిజిష్టర్ ఆప్ ఓటర్సు వివరాలను 17-ఏ ద్వారాను అందచేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రంలో ఈడిసి ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్న ఓటరు వివరాలను కూడా నమోదు చేయాలని చెప్పారు. విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యారా లేదా అన్ని వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాజరు కాని వారిపై ఎన్నికల సంఘ నియమ నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయు రోజున సిబ్బందికి చెక్లిస్టును అందచేయాలని అట్టి చెక్ లిస్టు ప్రకారం మెటీరియల్ తీసుకునేటపుడు పరిశీలన చేయడానికి సులభతరమవుతుందన్నారు. ఈ రోజున నిర్వహిస్తున్న మొదటి శిక్షణా కార్యక్రమానికి కొత్తగూడెం నకు 277 మంది, అశ్వారావుపేటకు 282 మంది, ఇల్లందునకు 240 మంది, పినపాకకు 270 మంది భద్రాచలంనకు 210 మంది మొత్తం 1279 మందికి గాను 90 మంది గై హాజరు అయినారు వారికీ షాకాజ్ నోటీసులు జరిచేయావల్సింది గా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ విధులు నిర్వహించు సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్నట్లు చెప్పారు. గతంలో విధులు నిర్వహించిన అనుభవం సిబ్బందికి ఉన్నదని, అందువలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడానికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో కొత్తగూడెం ఏ ఆర్ ఓ మధు, ఇల్లందు ఏ ఆర్ ఓ కాశయ్య,భూమి మరియు కొలతలు శాఖ ఏ డి కుసుమ కుమారి, ఇరిగేషన్ ఈ ఈ అర్జున్ రావు, ఇల్లందు తాసిల్దార్ రవికుమార్, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, సుజాతానగర్ తహసీల్దార్ శిరీష పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *