విద్యార్థినిని అభినందించిన జిల్లా కలెక్టర్
విద్యార్థినిని అభినందించిన జిల్లా కలెక్టర్
బోనకల్, శోధన న్యూస్ : నవోదయ ఫలితాల్లో ఆరవ తరగతిలో సీటు సాధించిన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రి విద్యార్థిని మోదుగు సాహిత్య జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం అభినందించారు. భవిష్యత్ లో ఉన్నత చదువుల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు. నవ్య బోనకల్ లోని సెయింట్ మేరీస్ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతోంది. విద్యార్థిని తండ్రి మోదుగు సుధీర్ బాబు బోనకల్ జెడ్పీటీసీగా, తల్లి లావణ్య కేజిబివి విద్యాలయంలో హిందీ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. ఉత్తమ ప్రతిభను చాటి నవోదయ ఫలితాల్లో సాహిత్య కేంద్రీయ విద్యాలయంలో సీటు సాధించడం పట్ల మండల విద్యా శాఖ అధికారి ఇందిరా జ్యోతి, టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, కలకోట పిఏసీఎస్ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వర రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, కాంగ్రెస్ యువ నాయకులు బీ పి నాయక్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య భద్రునాయక్, సేయింట్ మేరీస్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు.