ఖమ్మంతెలంగాణ

విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర

విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర

జూలూరుపాడు, శోధన న్యూస్ :  ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం లోని అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన సువర్చల సమేత అభయ హస్త వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. మంగళవారం విగ్రహ ప్రతిష్ఠ ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరై రవి చంద్ర విచ్చేసిన సందర్భంగా ఊరి పొలిమేరల నుంచి మేళతాళాలు ,డీజే పాటలు, బాణసంచా కాల్చరు. వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎంపీ రవిచంద్ర చేత గ్రామ బొడ్రాయి వద్ద వేద పండితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూజల అనంతరం శాలువా కప్పి సత్కరించి ఆశీర్వదించారు. పలికారు.ఈ సందర్భంగా ఎంపి రవిచంద్ర మాట్లాడుతూ గుడికి అవసరమైన సహాయ,సహకారాలు అందిస్తానని తెలిపారు.ఎంపి వద్దిరాజుకు స్వాగతం పలికిన వారిలో మున్నూరు కాపు సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి, ఆలయ కమిటీ సభ్యులు బండారు మూడవ వెంకయ్య, బంటు వెంకటేశ్వర్లు, బండారు నరసింహారావు, ఉశికళ రమేష్, బండారు పుల్లారావు, ఉసికల వెంకటేశ్వర్లు, బండారు నరేష్, సాంబారు నరేష్, పోగుల నరసింహారావు, బండారు శివ, బండారు అప్పారావు, బండారు తిరుమలరావు, ఉసికల శ్రీను, ఉసికల నరసింహారావు మండల మున్నూరు కాపు సంఘ నాయకులు మల్లెల నాగేశ్వరరావు, రామిశెట్టి నాగేశ్వరరావు, శిరం శెట్టి రామారావు, పెంటికల వీరబాబు, పాల్వంచ మండలం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిన్నంశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *