తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి

అమ్మ ఆదర్శ పాఠశాల పథకం అమలుపై సమీక్ష

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: వేసవి సెలవులు ముగిసేలోగా భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలోని అయా పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు, పనులు చేయించే విధానంపై బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశమందిరం లో డి ఆర్ డి ఓ విద్యచందన తో కలిసి నీటిపారుదల, పంచాయతీరాజ్‌, అర్‌అండ్‌బీ, మున్సిపల్‌, పీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ, ఈఈలతో వీడియోకాన్ఫిరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 697 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా మంజూరు అయిన పనులు అన్నిటికి వారం రోజుల్లో అంచనా వెయ్యం కు సంబంధించిన ప్రణాళికలను అన్ని శాఖల సమన్వయంతో సమర్పించాలని ఆదేశించారు. కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలో తాగునీరు, తరగతి గదుల్లో చిన్నచిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పని ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పటికీ పూర్తి అవుతుందో ఖచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మే 31 లోగా మంజూరు అయిన ప్రతి పనిపూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో రాగల 15 రోజుల్లో ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఎలక్ట్రికల్, త్రాగునీరు, టాయిలెట్ మొదలగు పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పని మొదలుపెట్టేముందు పూర్తి అయిన తర్వాత ఫొటోస్ ఆప్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ బ్యాంకులలో కమిటీల ఖాతాలు తెరిపించాలని అన్నారు. ప్రతిరోజు పనుల పురోగతిపై నివేదికలు అందజేయాలన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృశ్య రానున్న రెండు నెలలు అత్యవసరమైతే తప్ప సెలవులపై వెళ్లరాదని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో తాగునీటి లభ్యతను అంచనా వేసి శనివారంలోగా నివేదికలను అందజేయాలని ఎంపీడీవోలను, మిషన్ భగీరథ డి ఈ లు, ఏఈలు, పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని. రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలనికలెక్టర్ అధికారులు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *