ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ
సంగారెడ్డి ,శోధన న్యూస్: పార్లమెంటు సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు నేతృత్వంలో కలెక్టరేట్ సమావేశమందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో గల పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సి ఉన్న కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివి ప్యాట్ల మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియ గురించి కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరిస్తూ, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ పై పారదర్శకంగా చూపించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఖరారైన జాబితాను ప్రతినిధులకు, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
ఈ ర్యాండమైజేషన్ జాబితా ఆధారంగానే జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్ (ఎస్ సి) , జహీరాబాద్ , సంగారెడ్డి , పఠాన్ చెర్వు సెగ్మెంట్స్ వారీగా కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివి ప్యాట్లు కేటాయించడం జరుగుతుందని, ఆయా సెగ్మెంట్లలో స్ట్రాంగ్ రూమ్ లలో కట్టుదిట్టమైన భద్రతా నడుమ వాటిని భద్రపరుస్తామని కలెక్టర్ తెలిపారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 1616 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం 25 శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను రిజర్వ్ లో ఉంచడం కోసం కేటాయిస్తున్నామని, 40 శాతం వి.వి.ప్యాట్ లను రిజర్వ్ లో ఉంచేలా అదనంగా కేటాయిస్తున్నామని అన్నారు.
జిల్లాలోని ఐదు సెగ్మెంట్స్ లో గల 1616 పోలింగ్ కేంద్రాలకు గాను ఆన్ లైన్ ద్వారా ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరిగిందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలకు 372 కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, 417 వి వి ప్యాట్ లను , అందోల్ (ఎస్ సి) , నియోజకవర్గానికి 313 పోలింగ్ కేంద్రాలకు, 391కంట్రోల్ యూనిట్ లు, 391 బ్యాలెట్ యూనిట్లు,438 వివి ప్యాట్ లను, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో 313 పోలింగ్ కేంద్రాలకు 391 కంట్రోల్ యూనిట్లు,391 బ్యాలెట్ యూనిట్లు, 438 వి వి ప్యాట్ లు, సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో 281 పోలింగ్ కేంద్రాలకు 351 కంట్రోల్ యూనిట్లు,351 బ్యాలెట్ యూనిట్లు,393 వివి ప్యాట్ లు, పఠాన్ చెర్వు నియోజకవర్గం పరిధిలో 411 పోలింగ్ కేంద్రాలకు 513 కంట్రోల్ యూనిట్లు, 513 బ్యాలెట్ యూనిట్లు, 575 వివి ప్యాట్ లు, మొత్తం 2018 సియు లు, 2018 బి యు లు, 2216 వి వి ప్యాట్ లు కేటాయించడం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండంబజేషన్ నిర్వహించి కేటాయించడం జరిగిందన్నారు. మొదటి ర్యాండమైజేషన్ కు సంబంధించిన హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరిగిందని తెలిపారు.