సి విజిల్ పై అవగాహన ర్యాలీ….
ప్రజల స్వచ్ఛందంగా ఓటు వేయాలి.. ఎంపీవో కుమార్..
కరకగూడెం,శోధన న్యూస్ : భారత రాజ్యాంగ ప్రజలకు కల్పించిన వజ్రాయుధం ఓటు అని ఎంపీ ఓ కుమార్ అన్నారు. వెలుగు, ఎంపీడీవో కార్యాలయం ఆధ్వర్యంలో సి విజిల్ అవగాహనపై కరకగూడెం ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఓ కుమార్, త్రిగుణ ఆధ్వర్యంలో సి విజిల్ వ్యాప్ పై అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భారత ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించాలని ఉద్దేశంతో సి విజిల్ వ్యాప్ తీసుకువచ్చిందని ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అక్రమాలు చేస్తే ఈ వ్యాపు ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు అని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని. ప్రలోభాలకు గురి చేసే వారిని సి విజిల్ వ్యాప్ ద్వారా పట్టిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో, కార్యదర్శులు, శ్యాంసుందర్ రెడ్డి, రమేష్, శ్రీకాంత్, హరినాథ్, రవి, రామకృష్ణ, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది, వెలుగు సిసి విజయలక్ష్మి, సరస్వతి, వెలుగు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.