బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం .
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.
స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదా యకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రావ్ చిత్రమటానికి పూలమాలవేసి కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంత పేదరి కంలో జన్మించిన బాబూజీ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని ఆమె పేర్కొన్నారు. జాతీయోద్య మంలో పాల్గొన్న బాబూజీ రాజ్యాంగ పరి షత్ సభ్యుడిగా సేవలందించారని, స్వాతం త్ర్యానంతరం తొలి ప్రధానమంత్రి జవహ ర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కార్మిక సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందించారని కలెక్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరవు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించారని, రైల్వే, జాతీయ రవాణా శాఖ మంత్రిగా బాబూజీ తనదైన ముద్ర వేశారని, అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్న తికి ఎంతగానో పాటుపడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రావు జీవితాన్ని ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు.