ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి
ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి
సూర్యాపేట, శోధన న్యూస్ : ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (డిఎల్ఎస్ఎ), సీనియర్ సివిల్ జడ్జి పి శ్రీవాణి పేర్కొన్నారు. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీ ఎల్ ఎస్ ఏ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలు, నేరస్తులు ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే ముఖ్యమన్నారు. మన ఆరోగ్యం కాపాడుకునే హక్కు మనకు ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యం కాపాడుకునే హక్కును బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతుడిగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ సర్వీస్ మెంబర్ జె శశిధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోటాచలం, వైద్యాధికారులు పెండెం వెంకటరమణ, రమ్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూకల సుదర్శన్ రెడ్డి, డపుకు మల్లయ్య, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ వసంత సత్యనారాయణ పిళ్లై యాదవ్, అడిషనల్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ బోల్లెద్దు వెంకటరత్నం, అదనపు అడిషనల్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్స్ బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్, పెండెం వాణి, వచ్చింది కాబట్టి బార్ కోశాధికారి ధరావత్ వీరేష్ నాయక్, మెంబర్స్ సుంకర రవి, వెంకటేశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.