అశ్వాపురంతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

త్రాగునీటి ఎద్దడి తలెత్తవద్దు..

త్రాగునీటి ఎద్దడి తలెత్తవద్దు..
-ఆర్ డబ్ల్యూఎస్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : వేసవిలో తాగునీటికీ ప్రజలు ఇబ్బంది పడొద్దు అని పల్లెలు పట్టణాల్లో నీటి సరఫరాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి,

ఆర్ డబ్ల్యూఎస్

ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తో కలిసి అశ్వాపురం మండలం, కుమ్మరిగూడెం మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ సందర్శించారు. గోదావరి నీటిని నిల్వను పరిశీలించారు. ఇంటెక్ వెల్ నుంచి ఎంత నీటి సరఫరా జరుగుతుంది, మోటార్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రథం గుట్ట 40 ఎంఎల్ డి  వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్పనితీరును పరిశీలించారు.అనంతరం కుమ్మరిగూడెం ఐసోలేటెడ్ హ్యాబిటేషన్ సెంటర్లో నీటి సరఫరాను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ గిరిజనులతో తాగునీరు అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. రోజుకు ఎన్నిసార్లు ట్యాంకు పంపిస్తున్నారు అని అధికారులను అడగగా 5000 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ ను రోజుకు రెండుసార్లు సోలార్ పంపు ద్వారా నింపుతున్నట్టు అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన సోలార్ పంపు సమస్య తలెత్తినట్లయితే నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని ముందస్తుగా కరెంటు మోటార్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కొత్తగూడెం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తో కలసి మిషన్ భగీరథ,మున్సిపల్,నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు జిల్లాలో ఉన్న నీటి లభ్యత,నీటి సరఫరా, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సరఫరా పై అధికారులు పక్కా ప్రణాళికలతో సిద్ధం కావాలన్నారు. రహదారి మార్గం లేని హ్యాబిటేషన్లలో డబ్బాల ద్వారా నీటి సరఫరా చేయు నూతన విధానాన్ని ప్రవేశపెట్టిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ను అభినందించారు.జిల్లాలో తాగునీటిపై తీసుకున్న ప్రణాళిక మరియు కార్యచరణ అభినందనీయం అని తెలిపారు. జిల్లాలో నీటి లభ్యత ఉన్నదని దానిని ప్రణాళిక బద్ధంగా ఉపయోగించి, తాగు నీటికి సమస్యలు తలుత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారం లేదని తెలిపారు. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల మరియు పంచాయతీ స్పెషల్ అధికారు వారి పరిధిలో త్రాగునీడి సమస్యలు నీటి లభ్యత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ అధికారులు క్లోరినేషన్ టెస్టులు ఎన్నిసార్లు చేస్తున్నారని దానికి సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటికి డిమాండ్ పెరుగుతుందని సప్లై తగ్గుతుందని దానికి అనుగుణంగా ఖచ్చితమైన ప్రణాళికల ద్వారా నీటి ఎద్దడి కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు సత్వరంగా స్పందించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండల మరియు పంచాయతీ పరిధిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. హ్యాండ్, పంపులు, బోర్లు పైప్లైన్ మరమ్మత్తులు సత్వరం పూర్తి చేయాలని తెలిపారు. తాగునీటి సరఫరా పై వస్తున్న వ్యతిరేక వార్తలపై వెంటనే స్పందించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా జిల్లా అధికారులతో తాగునీరు మరియు ఎస్డిఎఫ్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని అన్ని మండలాలు, పంచాయతీలో ఎస్డిఎఫ్ పనుల పురోగతిపై వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. అన్ని పనులను వారం లోగా పూర్తి చేసి సంబంధిత పనుల ఫోటోలను నివేదిక రూపంలో అందజేయాలని అధికారులను ఆదేశించారు. మండల మరియు పంచాయతీ ప్రత్యేక అధికారులు అందరూ ప్రతిరోజు తమ పరిధిలోని నీటి సరఫరా కేంద్రాలను తనిఖీ చేయాలని, క్లోరినేషన్ ప్రక్రియ పరిశీలించి రిజిస్టర్లో సంతకం చేయాలని ఆదేశించారు. నీటి వనరులు లభ్యత లేని గ్రామాలలో రెండు రోజుల్లో బోర్లు వేయించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. మండల పంచాయతీ స్థాయిలో అధికారులందరూ నిరంతరం పర్యవేక్షణతో తాగునీటి సమస్యలను తలెత్తకుండా నిరంతరాయంగా నీటి సరఫ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *