జనగామతెలంగాణ

వేసవిలో ఆటంకం లేకుండా త్రాగునీరు అందించాలి

వేసవిలో ఆటంకం లేకుండా త్రాగునీరు అందించాలి

-జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్

జనగామ, శోధన న్యూస్: జనగామ జిల్లాలోని అన్ని గ్రామాలలో రానున్న వేసవిదృష్ట గ్రామాలలో సక్రమంగా తాగునీరు అందించాలని జిల్లా ఆదరణ కలెక్టర్ పింకేష్ కుమార్ ఆదేశించారు. దీనికోసం అధికార యంత్రాంగం పనిచేయాలని కోరారు. బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల నర్సరీలను అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు ఎప్పటికప్పుడు నీరు అందించాలని, వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. చుట్టూ ఫెన్సింగ్ చేయాలన్నారు. అలాగే ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. కూలీలకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అదే విధంగా తాగునీరు అందించే వనరులను ఆయన పరిశీలించి, సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ముందుగా చేయాలని, ఇప్పటికే రూపొందించిన తాగు నీటి ప్రణాళికల ప్రకారం చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా గుర్తించిన పనులను తనిఖీ చేసి, పక్కా ప్రణాళికతో మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆదేశించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *