తెలంగాణభూపాలపల్లి

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి

-జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి, శోధన న్యూస్: వేసవి పూర్తి అయ్యే వరకు పక్కా ప్రణాళికతో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి తెలిపారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి మిషన్ భగీరథ, ఇంట్రా, మునిసిపల్, విద్యుత్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ, ఎంపిఓలతో జిల్లాలో త్రాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం త్రాగునీటి సరఫరా పర్యవేక్షణకై రాష్ట్ర స్థాయి అధికారులను జిల్లాలకు నియమించిందని, దీన్ని బట్టి త్రాగునీటికి ఎంత ప్రాధాన్యత నిస్తుందో మనందరం గమనించాలని అన్నారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ కార్యాచరణతో త్రాగునీటి సరఫరాపై ముందుకు వెళుతున్నదని, ఎక్కడెక్కడ సమస్యలు వస్తున్నాయో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో వెంటనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని అన్నారు.నీటి సరఫరా పైప్ లైన్ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను తన దృష్టికి తేవాలని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి అధికారి నుండి గ్రామ స్థాయి సిబ్బంది వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. గత సంవత్సరం అనుకున్న దానికంటే తక్కువ వర్షపాతం నమోదైనందున మంచినీటి వనరుల్లో నీరు తగ్గిపోయి. మంచినీటికి సమస్య ఏర్పడిందని అన్నారు.రానున్న రెండు నెలలు మంచినీటి సరఫరాకు అత్యంత కీలకమని నిరంతర పర్యవేక్షణతో మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లాలో త్రాగునీటి సరఫరాపై వివరించారు. జిల్లాలోని ఒక మున్సిపాలిటీ, 241 గ్రామ పంచాయతీలకు భీంగన్ పూర్ (గొల్ల బుద్దారం), రామప్ప, గన్ పూర్, భీం గన్పూర్ (కోనం పేట) పంప్ హౌస్ లు ద్వారా త్రాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రెండు నెలలు నీరు సరఫరా చేసేందుకు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో సమ్మర్ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీని 6 జోన్లుగా విభజించి మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి కాకుండా 68585 మంది జనాభా ఉన్నారని, 13717 మిషన భగీరథ కుళాయిలు, 3347 సింగరేణి కుళాయిలు ద్వారా ప్రతి రోజు మంచి నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 20.70 ఎం ఎల్ డి నీళ్లు సరఫరా జరుగుతున్నదని అన్నారు. 81 బోర్ వెల్స్, 30 చేతి పంపులు, 2 ట్యాంకర్ల అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత 15 రోజుల క్రితం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 21 అక్రమ నీటి కుళాయిలు గుర్తించి తొలగించినట్లు తెలిపారు. ప్రతి రోజు నీటి సరఫరాపై ప్రజల స్పందన తెలుసుకుంతున్నామని, ఎక్కడైనా సమస్య వస్తే కంట్రోల్ రూముకు ఫోన్ చేస్తే తక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 14 ఫిర్యాదులు రాగా పరిష్కరించామని తెలిపారు. జిల్లాలోని 241 గ్రామ.పంచాయతీల్లోని 624 ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంకులు, 1263 బోర్ వెల్స్, 1739 చేతి పంపులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. 17.894 కిలో మీటర్ల ఇంట్రా పైపు లైన్లు ఉన్నాయని తెలిపారు. 9 మండలాల్లో ఎస్డీఎఫ్, డిఎం ఎఫ్టి, గ్రామ పంచాయతీ నిధులు 3.91 కోట్లుతో 416 చేపట్టామని వాటిలో 360 పనులు పూర్తి కాగా 9 పనులు పురోగతిలో ఉన్నాయని, 47 పనులు చేపట్టాల్సి ఉన్నట్లు తెలిపారు. రానున్న వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంచి నీటి పరీక్షలకు క్లోరోస్కోప్ లు అందించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపిడివో, ఎంపిఓ,.మిషన్ భగీరథ ఇంజినీర్లు ర్యాన్ ఢంగా గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల నుండి స్పందన తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *